గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (13:22 IST)

కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఉగాదికి రాబోతుంది

Kajal Aggarwal,
Kajal Aggarwal,
కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ నటుడు యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ సినిమా 'ఘోస్టీ'. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు  గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తీసుకొస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
 
ఉగాదికి సినిమా విడుదల కానున్న సందర్భంగా గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మాట్లాడుతూ ''ఘోస్టీ'లో కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయం చేశారు. పోలీస్, హీరోయిన్... రెండు పాత్రల్లో ఆమె కనిపించనున్నారు. రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. సామ్ సిఎస్ సంగీతం ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్'' అని చెప్పారు. 
 
త్వరలో 'ఘోస్టీ' తెలుగు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే ఒత్సాహిక దర్శకుడిగా యోగిబాబు కనిపించనున్నారు. తనతో పాటు స్నేహితులను మణిరత్నం అసిస్టెంట్లుగా కాజల్ అగర్వాల్‌కు పరిచయం చేసుకుంటారు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్ దగ్గరకు వెళతారు. యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. హీరోయిన్ అనుకుని దగ్గరకు వచ్చిన వాళ్ళతో 'నేను పోలీస్' అని చెబుతూ కాజల్ ఒక్కటి పీకడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇందులో కె.ఎస్. రవికుమార్ గన్స్ డీల్ చేసే మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  
 
కె.ఎస్. రవికుమార్, రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని తదితరులు నటించారు.