బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (19:40 IST)

సింగర్‌ స్మిత ప్రశ్నిస్తే అందుకు తెలంగాణ సి.ఎం.కూడా భాగస్వామ్యం ఉందన్న చంద్రబాబు

smitha sonylive
smitha sonylive
నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా ఛానల్‌ ప్రత్యేకత. ఫేస్‌ టు ఫేస్‌లో నిజం రాబడతాం అంటూ మరో ఛానల్‌, ప్రముఖుల మనసులోని మాటను నిర్భయంగా చెప్పిస్తామనే అన్‌ స్టాపబుల్‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు టీవీ మాద్యమాలలో వున్నాయి. తాజాగా సోనీ లివ్‌ ఓటీటీలో నిజం నిర్భయంగా అనే టాష్‌ షో చేసింది. ఫిబ్రవరి 10 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షో కు సింగర్‌ స్మిత హోస్ట్ చేస్తుంది. దీని గురించి  ప్రోమో నేడు రిలీజ్‌ చేశారు.
 
చిరంజీవి నుద్దేశించి.. స్టార్‌ డమ్‌ కొంతమందికే.. అని సింగర్‌ స్మిత  అడుగుతుంది.
చంద్రబాబును..  మాటకు ముందు వెన్నుపోటు.. అంటుంటారు.. అని అడిగింది. ఆ కాసేపటికి తెలంగాణ సి.ఎం.కూడా భాగస్వామ్యం  ఉంది అని చంద్రబాబు డైలాగ్‌ వుంది.
అలాగే సినీరంగంలో నెపోటిజం గురించి నానిని, రానాను స్మిత అడిగింది.
ఇక మహిళా సమస్యలగురించి రాధిక చెబుతూ, అప్పట్లో ఉమెన్‌ పవర్‌ వుండేది. ఎవరో వచ్చి స్పాయిల్‌ చేశారు అంటుంది. 
హీరోయిన్ల గురించి మాట్లాడే బాష ఎలా వుండాలంటే అంటూ.. సాయిపల్లవి చెబుతుంది.
 
ఇలా ఆసక్తికరంగా సాగే ప్రశ్నలు జవాబులు ఎంతమేరకు ప్రేక్షకులకు రీచ్‌ అవుతాయో కొద్దిరోజుల్లో తెలియనుంది. చంద్రబాబు మాట్లాడిన తెలంగాణ సి.ఎం.కూడా భాగస్వామ్యం అన్నది వెన్నుపోటు గురించేనా! ఇంకే ఏదైనా ఇష్యూ గురించా? అనేది త్వరలో తేలనుంది.