సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:22 IST)

సలార్‌పై ప్రభాస్‌ ఆశలుపెట్టుకున్నాడు!

salar prabhas
salar prabhas
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి తర్వాత అంతరేంజ్‌లో సక్సెస్‌ చేరుకోలేకపోయాడు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగినా తను ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశకు గురిచేశాయి. కానీ పలు భాషల్లో డబ్బింగ్‌ వల్ల నిర్మాతలకు సేఫ్‌ అయినట్లు మాత్రం ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సలార్‌ గురించి ఓ న్యూస్‌ గట్టిగా వినిపిస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌ కల్లా పూర్తి చేయాలని పట్టుదలతో వున్నారు. ఇప్పటికే శ్రుతిహాసన్‌ పార్ట్‌ టాకీ పార్ట్‌ కూడా పూర్తయిందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఆ వెంటనే ఆమె వర్షన్‌ కూడా డబ్బింగ్‌ పూర్తయిందని చెబుతున్నారు.
 
తాజా సమాచారం ప్రకారం త్వరలో ప్రారంభం కాబోయే  షెడ్యూల్‌లో ప్రభాస్‌ ఏకధాటిగా కంప్లీట్‌ అయ్యేవరకు షూట్‌లో పాల్గొనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ నాటికి పూర్తికావాలన్నది ప్రభాస్‌ నిర్ణయమని అందుకు ప్రశాంత్‌ నీల్‌ స్వాగతించారని సమాచారం. మార్చిలో ఈ సినిమా గురించి విడుదలతేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.\