ఏపీలోని మార్గదర్శి ఉద్యోగుల ఇంటిపై తనిఖీలు..
ఏపీలోని మార్గదర్శి ఉద్యోగుల ఇంటిపై తనిఖీలు జరిగాయి. ఏపీలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లల్లో తనిఖీళు జరుపుతున్నారు. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో ఏకకాలంలో ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా సోదాలు జరిపారు. అప్పట్లో మార్గదర్శి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.