మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (12:03 IST)

ఢిల్లీలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం

fire accident
ఢిల్లీలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఉన్న ఓ మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం  జరిగింది. ఓ గుడిసెలో చెలరేగిన భారీ మంటలు క్రమ క్రమంగా అవిఆ ప్రాంతమంతా విస్తరించడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 
 
దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ పోలీసులు 15 ఫైరింజన్లతో అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.