బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

బోల్తాపడిన డబుల్ డెక్కర్ బస్సు - ముగ్గురి మృతి.. ఎక్కడ?

double decker
ఢిల్లీ నుంచి బీహార్  వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలోని 88వ మైల్ స్టోన్ వద్ద ఈ ప్రమాదం బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాద స్థలిలోనే ముగ్గురు చనిపోగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. 
 
శివప్రకాష్ అనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బీహార్‌కు కొందరు ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతుండగా, 88వ మైల్ స్టోన్ వద్ద అదుబుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని డీఎం పుల్కిత్ ఖరే వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.