గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (15:15 IST)

ప్రిన్సిపాల్ - హాస్టల్ వార్డెన్ వేధించడం వల్లే విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య

suicide
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగిలో సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. ముక్యంగా, రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించారు. కళాశాల వేధింపుల కారణంగానే సాత్విక్ చనిపోయినట్టు తెలిపారు. 
 
'సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. తోటి విద్యార్థుల ముందు పదేపదే కొట్టడం వల్లే ఆవేదనకు గురయ్యాడు. ప్రొఫెసర్ ఆచార్యతో పాటు ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డిలు తరచుగా తిట్టడంతో సాత్విక్ మానసికంగా కుంగిపోయాడు. పైగా, సాత్విక్ ఆత్మహత్మకు పాల్పడిన రోజున తల్లిదండ్రులు వచ్చి వెళ్లారు. వారు వెళ్ళిపోగాన సాత్విక్‌ను కృష్ణారెడ్డి చితకబాదాడు. ఇంట్లో వాళ్లని తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డిలు పచ్చి బూతులు మాట్లాడేవారు. అలాగే, హాస్టల్ వార్డన్‌ నరేశ్ కూడా సాత్విక్‌ను వేధించినట్టు పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల నార్సింగిలోని ఓ కార్పొరేట్‌ కళాశాల తరగతి గదిలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుని వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. సాత్విక్‌ మృతికి కారకులైన ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్‌ నరేశ్‌లతో పాటు జగన్‌లపై 305 సెక్షన్‌ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.