గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (11:15 IST)

తెలంగాణాలో ఆ రెండు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

temparature
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఈ ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అలాగే, గత నెలాఖరు నుంచి పగటిపూట నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో గత యేడాది ఇవే రోజుతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఐదేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత యేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం దాదాపుగా మూడు డిగ్రీలు పెరిగింది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ శనివారం 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, పాలమూరు, భద్రాచలం జిల్లాలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు దాటాయి. వేసవిలో అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు ఎండలు ముందురుపోతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.