గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 04-03-2023 శనివారం దినఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Pisces
మేషం :- రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. వదంతులు నమ్మటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. కోర్టు పనులు వాయిదా వేయుట మంచిదని గమనించండి. ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం :- కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్య, రంగాల వారికి అనుకూలమైన సమయం. మీ భార్య మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీయానం, రుణయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దూరప్రయాణాలు కొంత ఇబ్బందులను కలిగిస్తాయి. 
 
మిథునం :- ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. మీ అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దైవ, సేవ, పుణ్య కార్యక్రమాలల్లో పాల్గొంటారు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరు కావడం మంచిది.
 
సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించ లేకపోతారు. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
కన్య :- చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. సంఘంలో గుర్తింపు పొందుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు మంచిది కాదని గమనించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం మంచదని గమనించండి.
 
తుల :- విద్యార్థులకు స్థిరబుద్ధి అవసరమని గమనించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకులు కలిగిస్తుంది. సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. సినిమా, విద్య, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
వృశ్చికం :- విద్యార్ధులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వృత్తి వ్యాపారపరంగా ప్రముఖులతో పరిచయాలు, ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు షాపింగుల్లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- విందులలో పరిమితి పాటించండి. రుణం తీర్చితాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఆడిటర్లు, అక్కౌంట్స్, ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చు కోవడం మంచిది కాదని గమనించండి.
 
మకరం :- మనస్సు ప్రశాంతతకై మీరు చేయుయత్నాలు ఫలిస్తాయి. రుణాలు, చేబదుళ్లు, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పెద్దల సలహా పాటించండి. ప్రతి విషయంలో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికి ధైర్యంతో ముందుకు నడుస్తారు.
 
కుంభం :- శత్రువులు మిత్రులుగామారి సహయం అందిస్తారు. స్త్రీలు విందు, వినోదాలు, విలువైనవస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఆశాజనకం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలదు. స్త్రీలకు అలంకారపు వస్తువులపట్ల అసక్తి పెరుగుతుంది. రచయితలకు, పత్రిక, మీడియారంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన అధికం అవుతుంది.