గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (17:04 IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొత్తి కడుపులో అల్సర్!

kcrcm
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో సీఎం కేసీఆర్ పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించారు. ఆదివారం ఆయన కడపు నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి తనిఖీలు చేయించుకున్నారు. 
 
పొత్తికడుపులో అసౌకర్యంగా ఉండటంతో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో అల్సర్ ఉన్నట్టు గుర్తించారు. ఎందుకోసం సీఎం కేసీఆర్‌కు ఎండోస్కాపీ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేశారు. మిగిలిన వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగా వచ్చాయని ఏఐజీ వైద్యులు ఓ ప్రకటన చేశారు. 
 
కాగా, అంతకుముందు కేసీఆర్ సతీమణి శోభ కూడా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను కూడా ఇదే ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు.