గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (11:57 IST)

పెద్దపల్లిలో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో ఐదేళ్లుగా కత్తెర

scissiors
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కడుపులో ఐదేళ్ళుగా కత్తెర ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. 2017లో మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను పెట్టి మరిచిపోయారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఆపరేషన్ ఫలితంగా ఆ మహిళ అనూహ్యంగా ఇబ్బందిని ఎదుర్కొన్న ఘటన తాజాగా పెద్దపల్లిలో వెలుగులోకి వచ్చింది. 
 
జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలిని కడుపులో మర్చిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. 
 
ఈ ఆపరేషన్ జరిగి అయిదేళ్లవుతున్న నొప్పి వెంటాడుతుండటంతో బాధితురులు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా వైద్యులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా, పొట్టలో కత్తెర ఉన్న విషయం బయటపడింది. 
 
దీంతో వైద్యులే నిర్ఘాంతపోయారు. మరోవైపు, గతంలో మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడిని నిలదీయగా ఆపరేషన్‌ ఖర్చులనీ తానే భరిస్తానంటూ కాళ్లబేరానికి దిగాడట కాగా, కడుపులోని కత్తెరకకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రం ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.