1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:30 IST)

నందమూరి తారకరత్న ఆరోగ్యం ఎలా వుంది?

Tarakaratna
నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా వుంది. దాదాపు రెండు వారాల పాటు ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
 
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురై ఆస్పత్రికి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. 
 
తాజాగా తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ అందింది. తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా విదేశీ వైద్యులనే నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సమాచారం. 
 
ఇంకా తారకరత్నను స్పృహలోకి తీసుకు రావటానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. మరో రెండు రోజుల్లో అంటే నారాయణ హృదయాలయ వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.