1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Krishna Express Services Cancelled on October 10 and 11

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు... రైల్వే అధికారుల వెల్లడి

train
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ అధికారులు వెల్లడించారు. గత రెండు వారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అలాగే, మరో మూడు ప్యాసింజర్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్ - వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట - బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు తెలిపారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం