1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రయాణికులకు విజ్ఞప్తి... ఈ నెల 16 వరకు రైళ్లు రద్దు

train
విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 16వతేదీ వరకు అనేక రైళ్ళను రద్దు చేశారు. డివిజన్ నిర్వహణ పనుల్లో భాగంగా, వీటిని రద్దు చేశారు. ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా పలు రైళ్ను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఈ పరిస్థితి కొనసాగనుంది. ఈ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ - తెనాలి (07279) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేయగా, తెనాలి - విజయవాడ (07575) రైలును కూడా అదే తేదీల్లో రద్దు చేశారు. బిట్రగుంట - విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15 వరకు, బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238) రైలును రేపటి నుంచి 13 వరకు, విజయవాడ - ఒంగోలు (07461) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు రద్దు చేశారు. 
 
ఒంగోలు - విజయవాడ (07576) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - గూడూరు (17259/17260) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - గూడూరు (07500) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, గూడూరు - విజయవాడ (07458) రైలును 12వ తేదీ నుంచి 16 వరకు, రాజమండ్రి - విశాఖపట్టణం (07466/07467) రైలును రేపటి నుంచి 15 వరకు, గుంటూరు - విశాఖపట్టణం (17239/17240) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ - విశాఖపట్టణం (22701/22702) రైలును 9, 10, 11, 13, 14 తేదీల్లో రద్దు చేశారు. 
 
రాజమండ్రి - విజయవాడ (07767) రైలును 9వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - రాజమండ్రి (07459) రైలును రేపటి నుంచి 15 వరకు, మచిలీపట్టణం - విశాఖపట్నం (17219/17220) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ - గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో నర్సాపూర్ - గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ - గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం - విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ - రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ - మచిలీపట్నం (07769), నర్సాపూర్ - విజయవాడ(07883), విజయవాడ - మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం - విజయవాడ(07770), విజయవాడ - భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్టణం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు.
 
విజయవాడ, గుడివాడ - భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్ - అలెప్పి (13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతియ - బెంగళూరు (12835) రైలును ఎల్లుండి, టాటా - బెంగళూరు (12889) రైలును 13వతేదీ, టాటా - యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ - ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారిమళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.