బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (19:31 IST)

వై నాట్ 175: ఎన్నికలకు సిద్ధం అవుతోన్న జగన్‌

jagan ys
సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనుండటంతో.. ఈసారి రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైకాపా లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఇందులో భాగంగా ఈ నెల 9న వైకాపా సభ ఏర్పాటు కానుంది. వై నాట్ 175 అనే నినాదంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇందుకోసం ఏర్పాటు కానున్న సదస్సుకు 8వేల మంది హాజరవుతారని అంచనా. 
 
విజయవాడలోని మున్సిపల్ స్టేడియం ఈ సభకు వేదిక కాబోతోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొంటారు.