బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (11:29 IST)

ఢిల్లీలో పర్యటనలో బిజీగా జగన్: అమిత్ షాతో భేటీ

Ap Jagan _Amit Shah
Ap Jagan _Amit Shah
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల సదస్సులో పాల్గొననున్నారు. ఈ రాత్రికి అమిత్ షా తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 
 
ఇక, హోం మంత్రి అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సు తరువాత కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ రాత్రి 8.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 
 
అంతకుముందు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో గంట సేపు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,359 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం తెలిపారు.