1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

అక్కడ ఇంజనీరింగ్ పనులు.. ఇక్కడ పలు రైళ్లు రద్దు

trains
ఖరగ్‌పూర్ డివిజన్‌లో రైల్వే ట్రాక్, ఇంజనీరింగ్ పనులు మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తర్వాత రైల్వే శాఖ నిద్రమత్తును వీడింది. దీంతో పలు ప్రాంతాల్లో భద్రతా పరమైన పనులు, తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ పనులకు ఆటంకంగా ఉండరాదని భావించిన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసుంది. ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
బుధవారం నాడు పుదుచ్చేరి - హౌరా (12868), షాలిమార్‌ - హైదరాబాద్‌ (18045), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ - షాలిమార్‌ (22854), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826), హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), తాంబరం - సంత్రాగచ్చి (22842), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), గురువారం నాడు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.