శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (09:40 IST)

పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. నేడు - రేపు పలు రైళ్లు రద్దు

trains
విజయవాడ డివిజన్‍‌లోని తాడి - అనకాపల్లి మార్గంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. నేల బొగ్గుతో వెళుతున్న ఈ గూడ్సు గురువారం పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు రైళ్ళను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. 
 
శుక్రవారం రద్దు అయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - కడప, హైదరాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - మహబూబ్ నగర్, సికింద్రాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - తిరుపతి, గుంటూరు - రాయగడ రైళ్లు ఉన్నాయి.
 
అలాగే, శనివారం రద్దు అయిన రైళ్లలో కడప - విశాఖపట్టణం, విశాఖపట్టణం - హైదరాబాద్, మహబూబ్ నగర్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - సికింద్రాబాద్, రాయగడ - గుంటూరు ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.