ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (13:25 IST)

రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగుల మృతి

elephants
చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిలో మూడు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. కూరగాయల లోడుతో వెళుతున్న వ్యాను ఢీకొనడంతో ఈ ఏనుగులు చనిపోయాయి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పలమనేరు సమీపంలో బూతలబండ వద్ద ఒక పెద్ద ఏనుగు, రెండు గున్న ఏనుగులు రోడ్డు దాటుతుండగా చెన్నై వైపు నుంచి టమోటా లోడుతో వెళుతున్న వ్యాను ఒకటి ఈ ఏనుగులను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో మూడు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ప్రమాదం తర్వాత వ్యాను డ్రైవర్ పారిపోయినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వాహన ఢీకొనగానే రోడ్డు అవతల గున్న ఏనుగులు ఎగిరిపడినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఏనుగు మాత్రం రోడ్డు పక్కనే పడిపోయి ప్రాణాలు విడిచింది.