శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్సు .. పలు రైళ్లు రద్దు

train
రాజమండ్రి వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ - లింగంపల్లి రైలు రెండు గంటల పాటు ఆలస్యంగా నడువనుంది. అలాగే, విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడల మధ్య నడిచే రైళ్ళను పాక్షికంగా రద్దు చేశారు. 
 
అయితే, పూర్తిగా రద్దు చేసిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టం - విజయవాడ, గుంటూరు - విశాఖ, విశాఖ - గుంటూరు, విశాఖ  - విజయవాడ, విజయవాడ - విశాఖ, విజయవాడ - గుంటూరు - గుంటూరు విజయవాడ, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు ఉన్నాయి.