1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Krishnam Raju last rites will be held at farm house tomorrow

కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

krishnamraju - ktr
సీనియర్ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్‌ వద్ద ఉన్న కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇవి తెలంగాణ ప్రభుత్వం లాంఛనాలతో అధికారికంగా నిర్వహిచంనున్నారు. 
 
కాగా, అనారోగ్య సమస్యలతో పాటు పోస్ట్ కోవిడ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా కృష్ణంరాజు ఆదివారం వేకువజామున 3.25 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు. వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా పర్యవేహిస్తున్నారు. 
 
మరోవైపు, కృష్ణంరాజు పార్థివదేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు నటులు చిరంజీవి, పవన్, వెంకటేష్, మహేష్, సుమన్, మోహన్ బాబుతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ద్వారకా శారదా పీఠం స్వరూపానంద స్వామి శివైక్యం