సంబంధిత వార్తలు
- పిల్లి కనిపించట్లేదు... తిండి మానేసిన ఫ్యామిలీ.. స్కూలుకు వెళ్లని కిడ్స్ ఎక్కడ?
- మమ్మల్ని పిచ్చోళ్ళను చేయొద్దు - నరేష్ తవ్విన గుంటలో విష్ణు పడిపోయాడుః జీవిత రాజశేఖర్
- సమంత క్రేజీ ట్వీట్ ... ఈ సమాజం మగాళ్ళను ఎందుకు ప్రశ్నించదు...(video)
- జీవితకు సపోర్ట్ చేశాం.. అంతా నరేష్ వల్లే జరిగింది.. మెగా బ్రదర్
- బెంగుళూరులో విషాదం : ఇంటి గోడ కూలి ఏడుగురు దుర్మరణం
నరేశ్ తవ్విన గుంతలో మోహన్‌బాబు ఫ్యామిలీ : జీవిత
నేను ఎంతో గౌరవంగా చూసే రాజీవ్ కనకాల, శివ బాలాజీ నిజాలు మాట్లాడడం లేదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాట తప్పు అని నిరూపిస్తా. వాళ్లది తప్పని నిరూపితమైతే మాకు ఓటేసి గెలిపించండి! నేను తప్పు మాట్లాడాను అనుకుంటే నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి. ఓట్లు కోసం సైనికుల్లా పోరాడండి. అన్యాయంగా కాదు.
ఎవరు మంచి చేస్తారో వాళ్లనే ఎన్నుకోండి. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడు అయ్యారు. ప్రకాశ్ రాజ్ మా అధ్యక్షుడు కాకూడదా? కళకి భాషాభేదాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ లేవనెత్తుతున్నారు. మోహన్‌బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది.
నరేశ్ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోతుంది. మా విషయంలో నరేశ్ చేసినవన్నీ స్వార్థపూరిత పనులే! ప్రకాశ్‌రాజ్ నిజాయతీగా పనిచేస్లారు. నేను మంచి పనులు చేయాలని వచ్చా. జీవిత రాజశేఖర్‌లను పిచ్చోళ్లని చేయొద్దు అని అన్నారు జీవిత .
ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. ఎన్నికల వేళ ధర్మంగా న్యాయంగా పోరాడండి. ఇది మన కుటుంబం. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాల అవసరం లేదు. లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. మా సభ్యుల్లో సుమారు 920 మంది ఉంటారు. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయాలంటే భయపడుతున్నారు.
అమ్మా మీకు ఓటు వేయగలమా మీకు? వచ్చి ఓట్లు గుద్దించుకువెళ్తారేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీవిత అన్నారు. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తర్వాతి కథనం
