గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (15:17 IST)

జీవితకు సపోర్ట్ చేశాం.. అంతా నరేష్ వల్లే జరిగింది.. మెగా బ్రదర్

మెగా బ్రదర్ నాగబాబు మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మా క్రెడిబులిటీని నరేష్‌ మసకబార్చారని… మాకు, జీవితకు అభిప్రాయభేదాలు ఉన్నా సపోర్ట్‌ చేశామన్నారు. అన్ని వివాదాలకు నరేష్‌ వైఖరే కారణమని మండిపడ్డారు. టాలీవుడ్‌‌పై ఆధిపత్యం చెలాయించాలని తమకేమి లేదని.. ప్రకాష్‌ రాజ్‌‌కు మద్దతుగా ఉండాలని చిరంజీవి చెప్పారని స్పష్టం చేశారు.
 
ఆలిండియాలో అన్ని అసోషియేషన్లతో మంచి సంబంధాలున్న వ్యక్తి ప్రకాష్‌ రాజ్‌ అని… మా అధ్యక్షుడు అనేది హోదా కాదు.. ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. మంచు విష్ణును అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోమని తాము అడగలేదని.. ప్రకాష్‌ రాజ్‌ లాంటి సీనియర్‌‌కు అవకాశం ఇవ్వాలని వాళ్లకు ఉండాలన్నారు. 
 
ప్రకాష్‌ రాజ్‌‌కు పోటీగా వాళ్లు నిలబడినప్పుడు డ్రాప్‌ కావాలని మేం అడగలేమని.. విష్ణు కూడా మద్దతు ఇవ్వమని తమను అడగలేదన్నారు. ప్రకాష్‌ రాజ్‌ కు మా తో 20 ఏళ్ల అనుబంధం ఉందని.. ప్రకాష్‌ ఒక ఇండియన్‌.. ఎక్కడైనా ఆయన పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు నాగబాబు.