గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (08:35 IST)

బెంగుళూరులో విషాదం : ఇంటి గోడ కూలి ఏడుగురు దుర్మరణం

బెంగుళూరు నగరంలో విషాదం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక బెల్గాం తాలూకాలో బుధవారం జరిగింది. 
 
ఈ ఘటనలో ఏడు సంవత్సరాల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 
 
గోడ శిథిలాల నుంచి ముగ్గురిని తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు చికిత్స కోసం ఆసుప్రతికి తరలిస్తుండగా మరణించారు. హెరెబాగేవాడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు