గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (18:21 IST)

'మా' ఎన్నికలపై నాగబాబు వ్యాఖ్యలు- ఓటుకు రూ. 15 వేలు ఇస్తున్నారు..

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు రాజకీయాలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇరు ప్యానెళ్లకు మద్దతుగా పలువురు నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య నిన్న విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. తాజాగా నాగబాబు మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాకు కోటి రూపాయలు తీసుకోనే దమ్మున్న నటుడు ప్రకాష్ రాజ్ అని నాగబాబు అన్నారు. ప్రకాష్ రాజ్ కోటి వదులుకుని 'మా' ఎన్నికల కోసం వచ్చారని నాగబాబు అన్నారు.
 
చిన్న పెద్ద సినిమాాలకు ప్రకాష్ రాజ్ కావాలని అన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకని ప్రశ్నించారు. ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్ ను అందరూ ఒప్పుకోవాల్సిందే అని అన్నారు.
 
ఓటుకు రూ. 15 వేలు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ను గెలిపించుకుంటామని నాగబాబు అన్నారు. వందశాతం ప్రకాష్ రాజుకు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
 
ఇక ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నారని ముందు నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో నాగబాబు ..మంచు ప్యానల్ ఫై మండిపడ్డారు. మన వాళ్లు అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నారు. కోట శ్రీనివాస రావు గారు తమిళం, కన్నడ, హిందీల్లో సినిమాలు చేయలేదా? మన వాళ్లు ఇప్పుడు ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో చేస్తున్నారు. 
 
ప్రకాష్ రాజ్ ఇండియన్ నటుడు. అన్ని భాషల్లో చిత్రాలు చేశాడంటూ ప్రకాష్ రాజ్ గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు. తన సినిమాలు మానేసి అయినా కూడా 'మా'కు టైం ఇస్తానని మాటిచ్చాడని నాగబాబు తెలిపారు.