1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. New Covid 19 cases in Telangana

తెలంగాణాలో ఇప్పటివరకు ఎంత చనిపోయారో తెలుసా?

New Covid 19 Cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 2384 మందికి ఈ వైరస్ సోకింది. శనివారం ఒక్కరోజు 11 మంది చనిపోయారు. ఈ మృతులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 755 మంది చనిపోయారు. 
 
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1,04,249 నమోదు కాగా, ఇప్పటివరకు 78,735 మంది రికవరీ కాగా.. 22,386 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  మృతుల సంఖ్య మొత్తం 755కు  చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 మందికి కొత్తగా కరోనా సోకింది.
 
రాష్ట్రంలో 15,933 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెచ్‌ఎంసీ 447, జగిత్యాల 91, ఖమ్మం 125, మేడ్చల్ 149, నల్గొండ 122, నిజామాబాద్ 153, రంగారెడ్డి 201, వరంగల్ అర్బన్ 123 కేసులు నమోదయ్యాయి. 
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తూచ్... దావూద్ మా దేశంలో లేడు : మాట మార్చేసిన పాకిస్థాన్