సంబంధిత వార్తలు
- నేడు హైదరాబాద్ నగర మేయర్ ఎన్నిక - బల్దియా చుట్టూ భారీ భద్రత
- ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి...
- హైదరాబాద్‌లోని కొండాపూర్ అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో వైద్యులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్
- సలసల కాగుతున్న నీటిని భర్తపై పోసింది.. వేధింపులు భరించలేక..?
- ఫ్లైట్ ఎక్కాలంటే... పడక సుఖం ఇవ్వాల్సిందే.. ట్రావెల్ ఏజెంట్ అరాచకం
ఆటో ఎక్కిన ఫార్మసీ విద్యార్థిని... నోరు నొక్కిపట్టి కిడ్నాప్ ... ఎక్కడ?
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఓ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. తన ఇంటికి చేరుకునేందుకు ఆటో ఎక్కిన ఆ విద్యార్థిని మరో ఇద్దరు విద్యార్థులు నోరు నొక్కిపట్టి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై హత్యాయత్నానికి యత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 19 యేళ్ళ యువతి బుధవారం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కళాశాల వద్ద ఆటో ఎక్కింది.
కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆటోలో అప్పటికే ఉన్న వృద్ధురాలు, పాప దిగిపోయారు. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్లగానే ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టేజీ వచ్చినా ఆటోను ఆపలేదు.
ఆమె అరిచేలోగానే ఆటోలో అప్పటికే ఎక్కి కూర్చున్న ఇద్దరు యువకులు ఆమె నోరు నొక్కి పట్టుకున్నారు. ఆటో ఘట్‌కేసర్ మండలంలోని యంనంపేట రాగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఆమెను ఎక్కించారు.
యువతి చాకచక్యంగా తన వద్దనున్న ఫోన్‌తో కిడ్నాప్‌కు గురైనట్టు తల్లికి సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్సల్ ఆధారంగా యంనంపేట చేరుకున్నారు.
యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న వ్యాన్, ఆటో డ్రైవర్లతోపాటు ఆటోలో ఎక్కిన ఇద్దరు యువకులు యువతిని వ్యాన్ నుంచి దించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కర్రలతో దాడి చేశారు.
అదేసమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను వదిలి దుండగులు పరారయ్యారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం
