శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:27 IST)

ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి...

హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కామాంధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేశాడు.
 
బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కడంతో ఆమెను జీడిమెట్ల శివార్లలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాని పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వదిలేసి పారిపోయాడు. బాధితురాలిని మేడిపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.