సంబంధిత వార్తలు
- ఎఫ్..ఐ.ఆ.ర్. చిత్రంపై ముస్లింలు అభ్యంతరం - భారతీయుడు గర్వపడే సినిమా- చిత్ర యూనిట్
- ఏపీ మంత్రి పేర్ని నానికి మోహన్ బాబు ఇంట ఆతిథ్యం .. టాలీవుడ్‌కు షాక్!
- పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్
- రజినీకాంత్ కొత్త సినిమా 169 చిత్రం అప్డేట్
- ప్రజలను నవ్వించే సినిమాలే చేస్తా - సెహరి హీరో హర్ష్ కనుమిలి
నేడు హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
రాష్ట్రపతి రాంనాథ్ కోవింజ్ ఆదివారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ ప్రకటన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు వచ్చి పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు చేరుకుంటారు.
అక్కడ 120 కిలో బంగారంతో తయారు చేసిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుంది. తర్వాత చినజీయర్ స్వామితో కలిసి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.
ఈ రాత్రికి ఆయన రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ వైపు ఎవరూ రాకపోవడంతో పోలీసులు విన్నవిస్తున్నారు.
తర్వాతి కథనం