1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:09 IST)

పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ పరీక్షల ప్రశ్నపత్రం లీకైంది. ఇటీవల ప్రారంభమైన ఈ పరీక్షలు సజావుగా సాగుతూ వచ్చాయి. ఇంతలోనే ఆఖరి సంవత్సరానికి సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా గుర్తించిన అధికారులు ఇతర జిల్లాల ప్రిన్సిపాల్స్‌ బోర్డుకు సమాచారం అందించారు. 
 
హైదరాబాద్ హయత్ నగర్ బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి ఎగ్సామ్స్‌ కంటే ముందుగానే పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్టుగా తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ గుర్తించింది. 
 
స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో విద్యార్థులకు షేర్ చేసినట్టు విద్యాశాఖ అధికారులు కనుగొన్నారు. దీంతో సాంకేతిక విద్యాశాఖ బోర్డ్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై కేసు కూడా నమోదైంది.