బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:14 IST)

విలేకరి ముసుగులో వ్యభిచారం

మీడియా ప్రతినిధి ముసుగులో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బాగోతం బట్టబయలైంది. షేక్‌పేట దర్గాకు చెందిన వ్యక్తి ఓ టీవీ ఛానెల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు.

బ్రోకర్లతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నాడు. వారితో నిజాంపేటలోని కేటీఆర్‌ కాలనీతో పాటు జగద్గిరిగుట్ట, ఆల్విన్‌కాలనీ, శుభోదయ కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
 
తాను మీడియా ప్రతినిధినని చెప్పుకుంటూ ఎవరూ తన దారికి అడ్డం రాకుండా బెదిరింపులకు గురిచే్సతున్నాడు. ఓ వాట్సాపు గ్రూపును ఏర్పాటు చేసి అందులో అనేక మంది పోలీసు అధికారుల నంబర్లను సైతం పెట్టాడు.

బాచుపల్లిలోని కేటీఆర్‌ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అక్కడ రైడ్ చేశారు.

ఈ సందర్భంగా రమేష్‌తో పాటు ఓ సెక్స్‌వర్కర్, ఇద్దరు విటులను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రమేష్ ఇతర చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.