శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:26 IST)

కృష్ణా జిల్లాలో జర్నలిస్టుల కరోనా వైద్య సహాయం కోసం సమన్వయ కర్తల నియామకం

కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ కరోనా వైద్య సహాయం కోసం సమన్వయకర్తల నియామకం కృష్ణాజిల్లాలో జర్నలిస్టులకు కరోనా వైద్య సహాయం కోసం డిపిఆర్‌ఓ యం.భాస్కరనారాయణను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియా తెలిపారు.

కరోనాను ముందువరుసలో వుండి పోరాడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఒకరిగా ఉన్నారు. అందుకే కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు సత్వర వైద్యం అందించేందుకు సమాచారశాఖ తరపున జిల్లా స్థాయి నోడల్ అధికారిగా డిపిఆర్మ్ యం.భాస్కరనారాయణను నియమించడం జరిగిందన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ తరపున డా . చైతన్యకృష్ణను నోడల్ అధికారిగా నియమించామన్నారు. వీరు ఇరువురు జిల్లాలో జర్నలిస్టులు వారి కుటుంబసభ్యులకు అవసరమైన కోవిడ్ సేవలకోసం సమన్వయకర్తలగా వ్యవహరిస్తారన్నారు . అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు కూడా జర్నలిస్టులకు కరోనా వైద్యం అందించడంలో జర్నలిస్టుల సమన్వయకర్తలకు సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

కోవిడ్ వ్యాధి బారినపడిన జర్నలిస్టులు , వారి కుటుంబసభ్యుల వైద్య సహాయం కోసం డిపిఆర్చ్ యం . భాస్కరనారాయణ ( 9121215285 ) డా . చైతన్యకృష్ణ ( 6300881194 ) సంప్రదించవచ్చన్నారు. ఈ సందర్భంలో జర్నలిస్టులు తమ అక్రిడేషన్ , ఆధార్ వంటి సమాచారాన్ని తెలియజేయవలసి ఉంటుందన్నారు.