శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (20:22 IST)

ఆ 11 మంది జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమి ఆర్థిక సాయం

హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున  ఆ 11 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండులక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు.

కరోనా పాజిటివ్ వచ్చిన ముప్పై మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున ఆరు లక్షల  రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదేవిధంగా హోంక్వారైంటైన్లో ఉన్న 13 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

ఇప్పటివరకు మొత్తం 7 లక్షల 30 వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు. బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్‌ను వాడాలని తెలిపారు.

ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పైన అవగాహన కలిగించడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు అన్నివిధాలు అండగా ఉంటుందని తెలిపారు.