బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:26 IST)

ఢిల్లీలో 529 మంది జర్నలిస్టులకు పరీక్షలు.. ముగ్గురికి కరోనా

దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ఓ సానుకూల వార్త చెప్పారు.

ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. జర్నలిస్టులందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
 
ఇలాంటి విపత్కర పరిస్థితులలో పాత్రికేయుల పని చాలా ముఖ్యమైనదని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు.

ముంబై, చెన్నైలో చాలా మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలవడంతో ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.