శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (09:16 IST)

కోవిడ్ బాధిత జర్నలిస్టులకు కిట్లు: విశాఖ కలెక్టర్

కోవిడ్ -19 కు గురి అయిన అక్రిడిటెడ్ జర్నలిస్టులకు బలవర్దకమైన ఆహారము అవసరమని, కావున వారికి కిట్లను అందజేయాలని  విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సమాచార శాఖ ఉపసంచాలకుడు వి.మణిరామ్ ను ఆదేశించారు.

జిల్లా కలెక్టరు జర్నలిస్టుల కోసం కిట్లను కలక్టరేట్ లో సమాచార శాఖ ఉప సంచాలకులు  వి.మణరామ్ కు అందజేశారు. ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్  -1, బియ్యం -10 కేజీలు, కంది పప్పు  -2 కేజీలు,  పసుపు  -¼ కేజీ, నెయ్యి - ½ కేజీ,  డ్రై ప్రూట్స్ - ½ కేజీ,  బెల్లం  -1 కేజీ,  చోడిపిండి  -1 కేజీ  మొత్తం 8 వస్తువులు ఉంటాయని తెలియజేశారు.

సదరు కిట్ లను కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు అందజేయాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు వారి పాజిటివ్ రిపోర్ట్, అక్రిడిటేషన్ జెరాక్సులను డిడి కార్యాలయములో పి.ఆర్.వో వెంకటరాజు గౌడ్ (సెల్ నెం: 9121215255) ను సంప్రదించాలని కోరడమైనది.