కరోనా సహాయం కోసం గుంటూరు జిల్లా జర్నలిస్టులు ఈ నంబర్లకు ఫోన్ చేయండి
కరోనా వైరస్ పై ముందువరుసలో వుండి పోరాడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా వున్నారని గుంటూరుజిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.
కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సత్వర వైద్యం అందించేందుకు సమాచార శాఖ తరపున జిల్లా స్థాయి నోడల్ అధికారిగా డివిజనల్ పౌర సంబంధాల అధికారి జే.శ్యాంకుమార్ ను, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ తరపున డా. కే.కృష్ణకుమార్, మెడికల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందన్నారు.
వీరు ఇరువురు జిల్లాలో జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు అవసరమైన కోవిడ్ వైద్య సేవల కోసం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారన్నారు. అదే విధంగా కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు కూడా జర్నలిస్టులకు కరోనా వైద్యం అందించడంలో జర్నలిస్టుల సమన్వయకర్తలకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కోవిడ్ వ్యాధిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం జే.శ్యాంకుమార్ (సెల్ నెంబర్. 99856 15089), డా. కే.కృష్ణ కుమార్, (సెల్ నెంబర్. 98487 82615 ) ను సంప్రదించవచ్చన్నారు.