సంబంధిత వార్తలు
- చాక్లెట్ ఇస్తానంటూ తీసుకెళ్ళి.. ఏం చేశాడో తెలుసా..?
- దినకరన్‌కు షాక్.. ఎడప్పాడి సర్కారు సేఫ్.. హైకోర్టు తీర్పు ఏం చెప్పింది?
- అమ్మాయిలు బాయిలర్ కోళ్లా : ఆడపిల్లలకు హర్మోన్ ఇంజెక్షన్లా?
- సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు
- మా అన్నయ్య చిరంజీవి వద్ద సెక్యూరిటీ గార్డ్ అయితే చాలనుకున్నా...
రేవంత్ రెడ్డికి భద్రత పెంచండి... ఖర్చు ఆయనే భరించాలి... హైకోర్టు
టీ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరిన విధంగానే ఆయనకు భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు కేంద్ర సిబ్బందితో నిరంతరం నలుగురు ఉండేలా భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పైన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల సమయం కాబట్టి తనకు 4+4 భద్రత కల్పించాలని కోరారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. కేంద్ర భద్రత కావాలని ఈసీని, కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. వాదనల అనంతరం హైకోర్టు.. రేవంత్ రెడ్డి కోరిన విధంగా భద్రత పెంపును కల్పించాలని, ఖర్చులను ఆయనే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తర్వాతి కథనం