దినకరన్‌కు షాక్.. ఎడప్పాడి సర్కారు సేఫ్.. హైకోర్టు తీర్పు ఏం చెప్పింది?
అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌కు మద్రాసు హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు సభాపతి పి.ధనపాల్ వేసిన అనర్హత వేటు సబబేనంటూ తీర్పునిచ్చింది. ప్రభుత్వ విప్ సిఫార్సు మేరకు స్పీకర్ చర్య తీసుకున్నారని అందువల్ల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సబబేనంటూ హైకోర్టు మూడో న్యాయమూర్తి సత్యనారాయణన్ గురువారం తీర్పునిచ్చారు.
హైకోర్టు తీర్పు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎడప్పాడికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాగా, ఈ 18 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని తమిళనాడు మంత్రి ఒకరు వెల్లడించారు. అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. మరోవ