సంబంధిత వార్తలు
- తెలంగాణా రాష్ట్రంలో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య..
- నానికి బెస్ట్ విషెస్ చెప్పిన ప్రభాస్ ఎందుకంటే!
- తెలంగాణలో కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
- 10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్ టిక్కెట్ ఆఫర్‌ను ప్రకటించిన వండర్లా హాలీడేస్
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్.. ఉరుములు, మెరుపులు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమ, మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఒక వైపు ఎండలు మండిస్తుంటే.. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం కురవనుంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రం మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుంది.
తర్వాతి కథనం
