శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (10:03 IST)

నానికి బెస్ట్‌ విషెస్‌ చెప్పిన ప్రభాస్‌ ఎందుకంటే!

keerthy, naani
keerthy, naani
హీరో నాని సినిమా దసరా నిన్ననే విడుదలైంది. ఈ సినిమా తెలంగాణ నేపథ్యం సినిమా. మొదటిరోజు తెలంగాణలో రెస్పాన్స్‌ బట్టి సక్సెస్‌ కేక్‌ను సంస్థ కార్యాలయంలో నిన్న కట్‌ చేశారు. హీరోయిన్‌ కీర్తిసురేష్‌ కేక్‌ కట్‌ చేసి నానికి తినిపించింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ఊరైన వీరవల్లిలో జరిగిన సంఘటనను తీశాడు. ఓవర్ సీస్ లోనో మొదటిరోజు బాగానే ఉండనే టాక్ తెచ్చుకుంది. అయితే ఇది మిగిలిన చోట్ల డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది.
 
మొదటిరోజు కలెక్షన్లు బాగా రావడంతో హీరో ప్రభాస్‌ నానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంత వసూలు అయింది కాస్త చెప్పవా! అంటూ సరదాగా పోస్ట్‌ చేశాడు. ఈ సినిమాకు నైజాంలో 6.77 కోట్ల షేర్‌ మొదటి రోజు వచ్చిందని ట్రేడ్‌వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఓపెనింగ్‌ బాగా వుంది. అందుకు స్పందిస్తూ, ఈరోజు నాని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, మీరు (ప్రేక్షకులు) మా దసరాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు, మీ ప్రేమ అంతా నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నాడు.