శ్రీ రామ నవమి వైభవాన్ని చాటి చెప్పేలా ఆదిపురుష్ : ఓమ్ రౌత్
ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో రాఘవ్‌గా ప్రభాస్, జానకిగా కృతి సనన్, శేష్‌గా సన్నీ సింగ్, భజరంగ్‌గా దేవదత్తా నాగే వారికి వంగి వంగి వంగి నమస్కరిస్తున్నట్లు ఉంది. శ్రీ రామ ధర్మాన్ని మరోసారి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే శ్రీ రాముడి నైజాలైన ధర్మం, ధైర్యం, త్యాగం వంటి అంశాలు పోస్టర్ లో ప్రతిబింబించేలా రూపొందించారు.
శ్రీ రామనవమి అంటే శ్రీరాముని జన్మదిన, వివాహ మహోత్సవం. ఆయన మంచితనానికి ప్రారంభంగా ఈ రోజును నిర్వహించుకుంటారు. అందుకే అధర్మాన్ని ఓడించి, ధర్మ స్థాపన చేసిన రాముడుగా ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశారు. ఇక రీసెంట్ గానే వైష్ణోదేవి ఆలయంలో ఆశీస్సులు అందుకుని మూవీ ప్రమోషన్స్ ను ఈ శ్రీ రామనవమి నుంచి ప్రారంభిస్తాం అని చెప్పింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టుగానే ఈ పోస్టర్ తో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. త్వరలోనే మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి టి- సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ నిర్మించారు. అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఆదిపురుష్ 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.