మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (11:42 IST)

తెనాలి కౌన్సిల్ సమావేశం: చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న వైకాపా, టీడీపీ కౌన్సిలర్లు (వీడియో)

Tenali
Tenali
నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెలుగుదేశం సభ్యుడు అభ్యంతరం తెలిపారు. వైసీపీ కౌన్సిలర్లు మాట్లడకుండా కూర్చోమన్నారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ 33 వార్డ్ కౌన్సిలర్ దాడికి దిగారు. తోటి కౌన్సిలర్లు అడ్డుకున్న ఆగకుండా వెంటపడి పదేపదే దాడి చేశారు. 
 
నిరసనగా పోడియం ముందు బైఠాయించారు. అలాగే న్యాయం జరిగేంతవరకు బైఠాయించి నిరసన చేస్తామని కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే దాడికి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. 
 
చైర్మన్ వివరణ ఇచ్చేవరకు ఇక్కడే బెటాయిస్తామని దాడి చేసిన వైసీపీ కౌన్సిలర్ లను సస్పెండ్ చెయ్యాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.