మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (12:13 IST)

తెలంగాణలో తెలుగుదేశం ఆవిర్భావ సభ.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా బుధవారం పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. 
 
హైదరాబాద్‌లో సభ నిర్వహించనుండటం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.  లంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇవాళ్టి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు.