సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (16:55 IST)

డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు?

vijayasaireddy
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైకా ఎంపీ  విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వేల ఎకరాల ఆసామి గీకం మూర్తి ఎక్కడ నుంచి వచ్చాడని అడిగారు. 
 
వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పాలని తెలిపారు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80శాతం  భూములు ఆక్రమిస్తే మిన్నకున్నారు కదా అంటూ మండిపడ్డారు. 
 
ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసనన్నారు.