సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (20:03 IST)

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చిరునవ్వుతో బదులిచ్చిన చంద్రబాబు

chandrababu
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. దీంతో తెరాస కాస్త ఇపుడు భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెరాస ప్రధాన కార్యదర్శి ఓ లేఖ రాశారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నోరు విప్పని చంద్రబాబు... మీడియా ప్రతినిధులను అలా చూస్తూ ఓ నవ్వు నవ్వేసి వెళ్లిపోయారు. వెరసి చిరునవ్వుతోనే కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందించారు. 
 
అంతకుముందు ఆయన తన భార్య నారా భువనేశ్వరితో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం చంద్రబాబును మీడియా పై విధంగా ప్రశ్నించగా, ఆయన చిరునవ్వుతో సమాధానమిచ్చి వెళ్లిపోయారు.