మంగళవారం, 31 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 8 సెప్టెంబరు 2022 (21:51 IST)

ఇండియన్ -2 షూటింగ్ స్పాట్‌లో బాబుతో కాజల్ అగర్వాల్

Kajal agarwal
Kajal agarwal
చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్-2లో నటిస్తోంది. దశాబ్ధకాలం టాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివ్‌గా వుంది. ఆమె దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. 
 
తాజాగా పెళ్లి అయిన కొన్నినాళ్ళకే బాబుకి కూడా జన్మనిచ్చింది. పెళ్లికాక ముందు కమిట్ అయినా ఇండియన్ 2 సినిమా షూటింగ్‌లో ఇప్పుడు బాబుతో కలిసి కాజల్ అగర్వాల్ పాల్గొంటుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా కొడుకుతో కలిసి కాజల్ అగర్వాల్ రావడం అక్కడి వారిని ఆకర్షించింది. 
 
తనయుడిని వెంట బెట్టుకుని వచ్చిన కాజల్ అగర్వాల్ షూటింగ్ స్పాట్‌లోకి అతడిని తీసుకురాకుండా హోటల్ రూమ్‌లో ఉంచినట్లుగా తమిళ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.