సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (08:43 IST)

అమరావతే రాజధాని అంటూ నాటకాలు ఆడుతున్నారు.. ధర్మాన

DHARMANA KRISHNA DAS
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై నరసన్నపేట ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పట్లో హైదరాబాద్ అభివృద్ధి అంటూ ఉత్తారాంధ్రుల శ్రమనంతా దోచిపెట్టారని, అక్కడ ఆస్తులు పెంచుకుని ఇప్పుడేమో అమరావతే రాజధాని అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
విశాఖ పట్టణాన్ని రాజధానిగా చేయడం చంద్రబాబు, ఆయన అనుచరులకు ఇష్టం లేదని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విశాఖను రాజధానిని చేయొద్దంటున్న ఆయనకు గట్టి సమాధానం ఇస్తామన్నారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతే ఏకైక రాజధాని అని యాత్రగా వస్తున్న వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని తెగేసి చెప్పారు.