శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (10:14 IST)

ప్రధానికి బాబు, జగన్ శుభాకాంక్షలు.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు...

Babu_modi
Babu_modi
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు. ఆయన 72వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే బీజేపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. 
 
ఈ వేడుకల్ని నెలరోజుల పాటూ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 
 
ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని.. దేశ ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని గతంలో కలిసిన ఫోటోను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. 
Babu_modi
Babu_modi
 
అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.