సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (15:50 IST)

టీడీపీది కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం.. మంత్రి రోజా ఫైర్

rk roja
ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని... ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను పెట్టాల్సిందని మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
ఎన్నికలకు ముందు క్యాంటీన్లను పెట్టి... క్యాంటీన్లను మేము పెట్టాం, మీరు తీసేశారంటూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని రోజా విమర్శించారు. అన్న క్యాంటీన్ల విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాన్ని టీడీపీ చేస్తోందని ఎద్దేవా చేశారు.
 
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెల రోజుల నుంచి టీడీపీ రాజకీయం చేస్తోందని రోజా మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారని అన్నారు.