ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (21:56 IST)

ఆసియా నోబెల్‌ను తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి

kksailaja
ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డును కేరళ మాజీ మంత్రి కేకే శైలజ తిరస్కరించారు. అయితే, ఈ అవార్డును తిరస్కరించడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డును అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటుచేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పురస్కారం వస్తే ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు. కానీ, కేరళ మాజీ మంత్రి కేకే శైలజ మాత్రం సున్నితంగా తిరస్కరించారు.
 
రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ దేశానికి ఏడో అధ్యక్షుడు. ఈయన కాలంలో ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణిచివేశాడని చరిత్రపుటలు చెబుతున్నాయి. అందుకే ఆయన పేరుతో ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని కేరళ కమ్యూనిస్టు మహిళా నేత స్వీకరించలేదన్న చర్చ సాగుతోంది. 
 
ఈమె కేంద్ర కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాతే ఈ అవార్డును తిర్సకరించారు. నిఫా వైర్, కోవిడ్-19 మహమ్మారిలతో పోరాడుతున్న కాలంలో శైలజ కేరళ ఆరోగ్య మంత్రిగా చేసిన సేవలకుగాను 64వ మెగాసెసే అవార్డుకు ఆమె పేరును పరిగణనలోకి తీసుకున్నారు.